తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే (2)
||తంబుర||
పాపులకై దిగి వచ్చెనట - రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని (2)
విందులు చేసిన యేసునకే - పేదల పాలిట పెన్నిధికే
||తంబుర||
ప్రతి హృదయం ప్రభు మందిరమై - వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి - క్రీస్తును చేరగ పరుగిడవా
||తంబుర||
