Repentance
తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన మనుష్యుడా
Thappipoyina Gorre Thappipoyina Manushyudaa
తప్పిపోయిన గొర్రె - తప్పిపోయిన మనుష్యుడా
యేసు ప్రేమ నీకు గురుతుందా
మంచి కాపరి యేసు - గొప్ప కాపరి యేసు
ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2)
కపటము కలిగిన గొర్రె
ద్వేషము కలిగిన గొర్రె
ఐక్యత లేని గొర్రె
యేసు ప్రేమ గురుతుందా (2)
మందను వీడినావు - ఒంటరి అయ్యినావు (2)
యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2)
||మంచి||
ప్రార్ధన చేయని మనుష్యుడా
వాక్యము వదలిన మనుష్యుడా
దేవుని మరచిన మనుష్యుడా
యేసు ప్రేమ గురుతుందా (2)
చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2)
మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2)
||మంచి||
