Praise

తంబుర సితార నాదముతో

Thambura Sithaara Naadamutho

Watch on YouTube
తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట - రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని (2) విందులు చేసిన యేసునకే - పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై - వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా (2) నరకాగ్నులలో పడవేసి - క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||