తమ దేవునెరుగువారు చేసెదరు
శక్తితో గొప్ప కార్యములు (2)
ఇచ్చకపు మాటల వలన - అక్షయుని విడువరు (2)
తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు (2)
||తమ||
సత్యమును విడువరు - ఉత్తములుగా నడిచెదరు (2)
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు (2)
||తమ||
మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు (2)
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు (2)
||తమ||
ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను (2)
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు (2)
||తమ||
అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను (2)
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు (2)
||తమ||
శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు (2)
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు (2)
||తమ||
అదిక జ్ఞానమును పొంది - తగ్గించుకొనెదరు తామే (2)
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు (2)
||తమ||
