Worship

స్తుతులకు పాత్రుడా

Sthuthulaku Paathrudaa - Ghanathaku Arhudaa

Watch on YouTube
స్తుతులకు పాత్రుడా - ఘనతకు అర్హుడా నిరతము నిలచువాడా - నీకే స్తోత్రము త్వరలో రానున్న - మా మెస్సయ్యా మరణము గెలచిన మా విమోచకుడా ఆరాధన చేసెదం అజేయుడా మా ప్రభూ అద్వితీయ సత్య దేవుడా నీవే మా రాజువు (2) ||స్తుతులకు|| నీతియు సమాధానము ఆనందము నీ రాజ్యము నీ సిలువయే మాకు శక్తి నీ సిలువయే మాకు బలము (2) ఆత్మానుసారమైన నవీన జీవితమునిచ్చితివి ఆత్మ నియమము ద్వారా పాప మరణము నుండి విడిపించితివి (2) ||ఆరాధన|| నీవే మా నిరీక్షణకర్తవు నమ్మదగినవాడవు నీలోనే మా అతిశయము మమ్ము విలువ పెట్టి కొన్నావు (2) ప్రభువా మీతో మేము ఏకాత్మయై యున్నాము అక్షయమగు కిరీటము ధరియింపజేయువాడవు నీవే (2) ||ఆరాధన||