Faith

సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక

Saagi Saagi Pommu Neevu Aagipoka

Watch on YouTube
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2) యేసుతోనే కడవరకు పరముదాక యేసయ్యతోనే కడవరకు పరముదాక వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2) విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా నా హృదయమా ||సాగి|| ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2) ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2) విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా ఎంతో వింతగా ||సాగి|| పాపమందు నిలచిన పడిపోదువు పరలోక యాత్రలో సాగకుందువు (2) ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2) నిత్య జీవ మార్గమందు సాగిపోదువు కొనసాగిపోదువు ||సాగి|| విశ్వాస పోరాటంలో విజయ జీవితం విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును (2) విలువైన ఆత్మతో బలము నొందుము (2) వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు పడిపోక నిలుతువు ||సాగి||