Evangelism

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు

Saakshyamichcheda Mana Swaami Yesu Devudanchu

Watch on YouTube
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2) సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2) మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2) పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2) నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2) బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య|| చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2) ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య|| పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2) ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య|| ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2) తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||