Devotional

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట

Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta

Watch on YouTube
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా... సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు - ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు - ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా... పరిమళము - పరిమళ తైలము - (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి... ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయెను - (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) క్షయమైన వాటి కొరకు - అక్షయుడగు ప్రభును వదిలి అపహసించిరి... సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను - (2) ||సహోదరులు||