సాగిపోదును - ఆగిపోను నేను
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2)
నా సహాయకుడు - నా కాపరి యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా - నేను భయపడను (2)
నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2)
నాకు కేడెము - నా కోటయు యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)