ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు (2)
పాడకుండా ఉండలేనయ్యా
నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా (2)
తీసివేయబడినాను త్రోసివేయబడినాను
ఆకస్మాత్తుగా గుంటలో
నెట్టివేయబడినాను (2)
అందరూ వదిలేసినా
నీవు నన్ను పట్టుకున్నావు
దుఃఖము ముంచేసినా
నీవు పైకి లేపావయ్యా (2)
||పాడకుండా||
ఉడికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను
ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను (2)
ఆఖరి ఆక్షణములో
నీవు నన్ను దర్శించినావు
ఊహించని నీ మేళ్ళుతో
నన్ను తృప్తి పరిచావయ్యా (2)
||పాడకుండా||
