Worship
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి
Oohalu Naadu Ootalu Naa Yesu Raaja Neelone Yunnavi
ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి (2)
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2)
||ఊహలు||
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా (2)
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు (2)
||ఊహలు||
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా (2)
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు (2)
||ఊహలు||
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే (2)
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే (2)
||ఊహలు||
