Thanksgiving

ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు

Oohinchaledhayyaa Ee Melulanniyu

Watch on YouTube
ఊహించలేదయ్యా ఈ మేలులన్నియు తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు (2) పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా (2) తీసివేయబడినాను త్రోసివేయబడినాను ఆకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను (2) అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా (2) ||పాడకుండా|| ఉడికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను ఆశలన్నీ నీరుగారి వేసారిపోయాను (2) ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు ఊహించని నీ మేళ్ళుతో నన్ను తృప్తి పరిచావయ్యా (2) ||పాడకుండా||