Worship

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను

Oohinchalenaayaa Vivarinchalenaayaa Enaleni Nee Premanu

Watch on YouTube
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ|| నా మనసు వేదనలో - నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ|| నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను (2) ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||