Christmas

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు

Ninnu Choodaga Vachchinaadura Deva Devudu

Watch on YouTube
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2) లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండి తప్పించే ప్రియ పుత్రుడాయనే (2) ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే (2) ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| తోడుగ వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే (2) చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||