Devotional

నిన్ను తలచి నను నేను మరచి

Ninnu Thalachi Nanu Nenu Marachi

Watch on YouTube
నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని (2) నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని (2) సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||