నిన్ను కీర్తింతును ఇల ఘనపరతును
అన్నివేళల ఆరాధింతును
సృష్టికర్తవని నీలో రక్షణని
ఎల్లవేళల ప్రకటింతును (2)
యేసూ నీవే నా రాజువు
యేసూ నీవే మహారాజువు (2)
||నిన్ను||
దావీదువలెనే నాట్యమాడి
ఆడిపాడి స్తోత్రించెదన్
ఆత్మాభిషేకముతో నింపబడి
అనుదినము నే సాగెదన్ (2)
||యేసూ||
నరులను నమ్మి మోసపోతిని
నీ చెంతకు చేరితినీ
నమ్మదగిన నా దేవుడని
నిను వెంబడించితిని (2)
||యేసూ||
ఒంటరిని నాకు మంచి తోడువు
నీ సన్నిధిలో బ్రతికెదనూ
తుది శ్వాస వరకు నీ సాక్షిగా
జీవించెద నిశ్చయం (2)
||యేసూ||
