Worship

నీ నామమే ఎద కొలిచెదను

Nee Naamame Edha Kolichedanu

Watch on YouTube
నీ నామమే ఎద కొలిచెదను నీ వాక్యమునే సదా తలచెదను (2) సైన్యములకధిపతియగు దేవా ఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే|| దోష రహితుడ - సృష్టి కారుడ నేరమెంచని నిర్ణయకుడా సిలువ దరుడ - మరణ విజయుడ లోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము|| నిన్ను మరచిన - మిగులు శూన్యము నీతో అణకువ పెంచు జ్ఞానము నాదు లోకము - బహు కలవరము నీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము|| క్షణము వీడని - నీడ నీవని నమ్మి నిరతము నిన్ను వేడెద నీదు పాత్రగ - యాత్ర సాగెద నీదు ఘనతను ఎలిగి చాటెద (2) ||సైన్యము||