Praise

నీ నామం నా గానం

Nee Naamam Naa Gaanam

Watch on YouTube
నీ నామం నా గానం నీ స్మరణే నా సర్వం (2) నా కాపరి నీవే యేసయ్యా నా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం|| నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2) సంగీత స్వరములతో స్తుతియింతును (2) స్తుతులందుకో నా యేసురాజా (2) ||నీ నామం|| ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే (2) నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2) బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2) ||నీ నామం||