నీ నామమే ఎద కొలిచెదను
నీ వాక్యమునే సదా తలచెదను (2)
సైన్యములకధిపతియగు దేవా
ఆది దేవుడవయిన యెహోవా (2)
||నీ నామమే||
దోష రహితుడ - సృష్టి కారుడ
నేరమెంచని నిర్ణయకుడా
సిలువ దరుడ - మరణ విజయుడ
లోక రక్షక యేసు నాథుడా (2)
||సైన్యము||
నిన్ను మరచిన - మిగులు శూన్యము
నీతో అణకువ పెంచు జ్ఞానము
నాదు లోకము - బహు కలవరము
నీదు వాక్యము తెలుపు మార్గము (2)
||సైన్యము||
క్షణము వీడని - నీడ నీవని
నమ్మి నిరతము నిన్ను వేడెద
నీదు పాత్రగ - యాత్ర సాగెద
నీదు ఘనతను ఎలిగి చాటెద (2)
||సైన్యము||
