నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా
||నన్ను||
దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా
||నన్ను||
మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా
||నన్ను||
చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా
||నన్ను||
జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా
||నన్ను||
కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా
||నన్ను||
ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా
||నన్ను||
శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా
||నన్ను||
వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా
||నన్ను||
