Repentance

నన్ను నీవలె నిర్మించినను

Nannu Neevale Nirminchinanu

Watch on YouTube
నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు నిను బాధించినా భరియించితివా నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె|| ఎరిగి ఎరిగి చెడిపోతిని తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) బ్రతికున్న శవమునై నేనుంటిని అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె|| భయభక్తులు లేని వెర్రివాడనై కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2) ఒక పూటకూటికై ఆశపడితిని వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె|| సిల్వలో నీ శ్రమ చూడకుంటిని కల్వరి ప్రేమను కానకుంటిని (2) నిన్ను సిలువ వేయమని కేకలేసితి అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||