Thanksgiving

నన్ను చూచువాడా

Nannu Choochuvaadaa

Watch on YouTube
నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు (2) కూర్చుండుట... నే లేచియుండుట (2) (రాజా) బాగుగ ఎరిగియున్నావు (2) ||నన్ను చూచువాడా|| తలంపులు తపనయు అన్ని అన్నియు ఎరిగియున్నావు (2) నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు (2) ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా|| వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (2) (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు (2) ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా|| పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా (2) విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది (2) ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా||