Christmas

దిక్కులెన్ని తిరిగినా ఏ దిక్కు వెదకినా

Dikkulenni Thiriginaa Ae Dhikku Vedhakinaa

Watch on YouTube
దిక్కులెన్ని తిరిగినా - ఏ దిక్కు వెదకినా (2) మనకు దిక్కు ఈ బాల యేసుడే ఈ ధరణిలో - జోల పాట పాడ రారండయ్యో ఓ జనులారా - మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) కన్య గర్భమందు నేడు - కరుణగల రక్షకుండు (2) స్థలము లేక తిరిగి వేసారెను నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) కల్లబొల్లి కథలు కావు - ఆ గొల్ల బొయల దర్శనంబు (2) నేడు నోవాహు ఓడ జోరేబు కొండ గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| దిక్కులేని వారినెల్ల - పాపమందు బ్రతికేటోళ్ల (2) తన మార్గమందు నడుప బుట్టెను ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) జన్మించాడు నేడు - ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||