Devotional

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా

Dinadhinambu Yesuku Dhaggaragaa Cheruthaa

Watch on YouTube
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||