Christmas
దిక్కులెన్ని తిరిగినా ఏ దిక్కు వెదకినా
Dikkulenni Thiriginaa Ae Dhikku Vedhakinaa
దిక్కులెన్ని తిరిగినా - ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో - జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా - మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)
కన్య గర్భమందు నేడు - కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు - ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి
||దిక్కులెన్ని||
దిక్కులేని వారినెల్ల - పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు - ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో
||దిక్కులెన్ని||
