Devotional

దిక్కులన్ని నీవేలే

Dikkulanni Neevele

Watch on YouTube
దిక్కులన్ని నీవేలే - దిక్కులన్ని నీవేలే (2) ఎక్కడో నిన్ను వెదక - ఏలనయ్య ఓ స్వామీ (2) నిత్యమై నాలోన - జీవమై నీవుండ ||దిక్కులన్ని|| లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2) నిక్కముగా నర జన్మ - ధన్య చరితాయనే (2) చక్కనయ్య త్యాగానాన - చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని|| దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2) భాష రాని నా నోట - పాడుకుందు నీ పాట (2) హీనమైన రూపానాన - గానమై యేసన్న ||దిక్కులన్ని||