చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై - గోడు జెందె గదా
||చూడరే||
నా చేతులు చేసినట్టు - దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు
||చూడరే||
దురితంపు దలఁపులే - పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ - ముండ్ల కిరీటమై
||చూడరే||
పరుగెత్తి పాదములు - చేసిన పాపంబులు
పరమ రక్షకుని - పాదములలో మేకులు
||చూడరే||
పాపేఛ్చ తోడ గూడు - నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని - బల్లెంపు పోటులు
||చూడరే||
