చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక - చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను
జాచుచు గరములు - చక్కగా నీవైపు
||చూచు||
మేమరులమై యుంటిమి
మార్గము వీడి - మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి
||చూచు||
నిను నమ్ము పాపులకు
వారెవరైనా - నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు - ఘనమైన నీ కృప
||చూచు||
నీ భయము మాయెదలను
నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము - వైభవ మొందుచు
నే భయము లేకుండ - నీ భువిని గొన్నాళ్ళు
||చూచు||
దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి - దయచేయుమని కోర
దయ జూపి మన్నించు - దయగల మా తండ్రి
||చూచు||
