Prayer
యెహోవా నను కరుణించుమా నా దేవా నను దర్శించుమా
Yehovaa Nanu Karuninchumaa Naa Devaa Nanu Dharshinchumaa
యెహోవా నను కరుణించుమా
నా దేవా నను దర్శించుమా (2)
ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను
||యెహోవా||
విచారము చేత నా కన్నులు గుంటలై
వేదన చేత నా మనస్సు మూగదై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2)
||దినమంతయు||
అవమానము చేత నా గుండెలో గాయమై
(నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2)
||దినమంతయు||
