యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్
||యెహోవా||
మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్
||యెహోవా||
పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను
||యెహోవా||
నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది
||యెహోవా||
చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసమొందెదను
||యెహోవా||
