సిలువే నా శరణాయెను రా
నీ... సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ... సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ... సిలువే నా శరణాయెను రా
సిలువను చూచు కొలది - శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ... సిలువే నా శరణాయెను రా
సిలువను దరచి తరచితి - విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ... సిలువే నా శరణాయెను రా
పలు విధ పథములరసి - ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ... సిలువే నా శరణాయెను రా
శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ... సిలువే నా శరణాయెను రా
