Good Friday

సిలువలో సాగింది యాత్ర

Siluvalo Saagindi Yaathra

Watch on YouTube
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||