Good Friday

ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట

Priya Yesu Dehamulo Ubike Rakthapu Oota

Watch on YouTube
ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా కొరడాల దెబ్బలచే - దేహము చారలై చీలగా సుందరుండు వికారుడాయే - చూడనొల్లని వాడాయే ||ప్రియ యేసు|| నా దుష్ట తలంపులకై - ముండ్ల కిరీటమా తలపై నా నీచ నడతలకై - పాద హస్తములలో చీలలా ||ప్రియ యేసు|| ముఖముపై గ్రుద్దిననూ - చెంపలపై కొట్టిననూ బల్లెము ప్రక్కలో దింపినా - నీచునికి నిత్య జీవమా ||ప్రియ యేసు|| ఇది ఎంతటి ప్రేమ ప్రభు - ఏమని వర్ణింతు నిన్ను సజీవ యాగముగా - నన్నే నీ-కర్పింతును