Worship

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు

Premaa Poornudu Praana Naathudu

Watch on YouTube
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ - కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2) రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||