Repentance

ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి

Premaa Ane Maayalo Chikkukunna Sodhari

Watch on YouTube
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి కన్న వారి కలలకు దూరమై కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా|| తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని (2) రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే - పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి - బ్రతుకులో నీవు చెడి - (2) ||కన్న|| ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని (2) యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని నీవు జీవిస్తే - తనువు చాలిస్తే నరకము చేరుకొని - అగ్నిలో కూరుకొని - (2) కొన్న తండ్రి కలలకు దూరమై కష్టాల కోడలికి చేరువై (2) ||ప్రేమా||