Worship

నీ సన్నిధిలో ఈ ఆరాధనను

Nee Sannidhilo Ee Aaraadhananu Sweekarinchumu

Watch on YouTube
నీ సన్నిధిలో ఈ ఆరాధనను స్వీకరించుము నా ప్రభువా (2) నా హృదయములో నీ ఆత్మ బలమును నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో|| ఆవిరివంటి వాడను నేను మేఘ స్తంభమై నిలిచావు (2) చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2) వర్షముగా నను మార్చావు - మార్చావు ||నీ సన్నిధిలో|| మోడులా మిగిలిన నాకై సిలువ మ్రానిపై వ్రేళాడి (2) నీ రక్తముతో నను ప్రోక్షించి (2) నా మరణ శాపం తొలగించావు - తొలగించావు ||నీ సన్నిధిలో||