నీ సన్నిధిలో నేనున్న చాలు - చాలు
నీతోనే ఉన్న నాకెంతో మేలు - మేలు
శ్రమ కాలమైనా తోడుగ నీవుండ
నీ నామ ధ్యానం నే చేతునయ్యా
నీతోనే నేను ఉంటానయ్యా (2)
నా జీవితాన నీవున్న చాలు - చాలయ్యా
నీతోనే ఉన్న నాకెంతో మేలు - మేలయ్యా
||నీ సన్నిధిలో||
అర్పించినావు నా కొరకు నీ ప్రాణం
నా పాప భారం తొలగింప గోరి
నాతోనే నీవు ఉండాలని (2)
ఆశించినది నా రక్షణేగా - నీవు
నీతోనే నేను ఉంటాను ప్రభువా - యేసు
||నీ సన్నిధిలో||
నను చంపబోయి సాతాను రాగా
నీ చేతి గాయం రక్షించునయ్యా
నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2)
నమ్మాను ప్రభువా నీదైన లోకం - లోకం
నీతోనే ఉన్నా అది నాకు సొంతం - సొంతం
||నీ సన్నిధిలో||
