నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)
మహిమ గల నా యేసు రాజా (2)
||నీ సన్నిధియే||
ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని (2)
నీ ప్రసన్నత నాకు చూపుము (2)
||నీ సన్నిధియే||
ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు (2)
నీ గుడారపు మాటున (2)
||నీ సన్నిధియే||
