మరువలేను - మరువలేను - మరువలేనయ్యా (2)
నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం (2)
మరువలేనయ్యా.. మరువలేనయ్యా...
యేసయ్యా.. యేసయ్యా - యేసయ్యా.. దయామయా (2)
ఓ ఓ ఓ.... మరువలేనయ్యా.. మరువలేనయ్యా...
బలి పశువుగ నా పాపము కొరకై
బలియై పోతివయ్యా (2)
నోరు తెరువక భారపు సిలువను
భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా
||యేసయ్యా||
పంచ గాయములలో కారుచున్న రుధిరం
నిను ముంచి వేసెనయ్యా (2)
దోష రహితుడా హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా
పగబట్టి చంపిరయ్యా
||యేసయ్యా||
ఏ దారి గానక - తిరిగిన నన్ను
నీ దరి చేర్చితివే (2)
మార్గము నీవై సత్యము నీవై
జీవము నీవైతివే
నా సర్వము నీవైతివే
||యేసయ్యా||
