Praise

హల్లేలూయా యని పాడి స్తుతింపను

Hallelooyaa Yani Paadi Sthuthimpanu

Watch on YouTube
హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) పూజించి... పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) పూజించి... పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) పూజించి... పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||