భూమ్యాకాశము సృజించెను - జీవముతో దానిని నింపెను
తన హస్తముతో నిర్మించెను - జీవాత్మగా నన్ను నిలబెట్టెను
మహిమ ఘనతకు అర్హుడవు - సైన్యములకు అధిపతి నీవే
హా-మెలెక్ యేషువా నీకే వందనాలు (4)
మమ్మేలు యేషువా వందనాలు - జగమేలు యేషువా వందనాలు (2)
నా నిమిత్తం ప్రతిదండన చేయు - నా వైపున యుద్ధం చేయువాడవు (2)
నా శత్రువుల చేతినుండి నన్ను - విడిపించు వాడవు నీవే (2)
మహిమ ఘనతకు అర్హుడవు - సైన్యములకు అధిపతి నీవే
||హా-మెలెక్||
శ్రమలైనను ఎన్ని బాధలైనను - రోగమైనను ఎంత శోధనైనను (2)
నాకు బలమైన కోటయు నీవే - నా బలిష్ట దుర్గము నీవే (2)
మహిమ ఘనతకు అర్హుడవు - సైన్యములకు అధిపతి నీవే
||హా-మెలెక్||