Worship

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా

Divinelu Sthothraarhudaa Yesayyaa

Watch on YouTube
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు - కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2) మాట తప్పని మహనీయుడవు - మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు - నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) దాటి వెళ్లని కరుణామూర్తివై - మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై - దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) దివ్యమైన ప్రత్యక్షతతో - నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా - రూపు దిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||