Christmas

దివ్య తార

Divya Thaara

Watch on YouTube
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార (2) వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2) పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య|| జన్మించె యేసు రాజు - పరవశించె పరలోకం (2) మధురమైన పాటలతో మారుమ్రోగెను క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే (2) తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య|| ప్రభు యేసు నామం - ప్రజా సంఖ్యలోనున్నది (2) అవనిలో క్రీస్తు శకము అవతరించినది క్రీస్తు జన్మమే మధురమాయెనే శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2) తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య|| పాపలోక జీవితం - పటాపంచలైనది (2) నీతియై లోకంలో వికసించినది క్రీస్తు జన్మమే ప్రేమామయమే చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2) తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య||