Worship

ఆరాధనా నీకే ఆరాధనా యేసు అన్ని వేళలా

Aaraadhanaa Neeke Aaraadhanaa Yesu Anni Velalaa

Watch on YouTube
ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా యేసు అన్ని వేళలా (2) నా కష్టాలలో ఆరాధన శోక సంద్రములో నీకే ఆరాధన నా నష్టాలలో ఆరాధన లోకమే నను విడచినా నీకే ఆరాధన ||ఆరాధనా|| ఓటములే నాకు మిగిలినా - కన్నీట నిండ మునిగినా ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన నా ప్రియులే చేయి విడచినా - సిరులున్నా లేక పోయినా నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2) యేసయ్యా నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా|| రోగములే క్షీణించినా - శాంతిలేక కుమిలిపోయినా సర్వమును భరించు యేసుకే ఆరాధన శోధనలే చుట్టుముట్టినా - పాపములే రాజ్యమేలినా లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2) యేసయ్యా నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2) ||ఆరాధనా||