Praise

ఆరాధించెదం ఆర్భాటించెదం యేసుని సన్నిధిలో

Aaraadhinchedam Aarbhaatinchedam Yesuni Sannidhilo

Watch on YouTube
ఆరాధించెదం ఆర్భాటించెదం - యేసుని సన్నిధిలో ఆనందించెదం మరల ఆనందించెదం - దేవుని సన్నిధిలో సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా యెరికో కోట గోడలన్ని కూలిపోయే - కాలిపోయే ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా - ఆర్భాటించగా స్తుతులపై ఆసీనుడా యేసయ్యా మా ప్రార్ధనలు ఆలకించువాడా స్తుతియాగము చేయు వాడే నిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా|| యూదా దేశము మీదికి శత్రు సైన్యము - దండెత్తగా యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా - స్తోత్రము చేయగా దేవుడే యుద్ధము జరిపెను అద్భుత జయమును పొందిరి బెరాకా లోయలో కూడిరి కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి ||యేసయ్యా||