Devotional

యేసు నీవే చాలు నాకు

Yesu Neeve Chaalu Naaku

Watch on YouTube
యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము మనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు|| నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2) ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ కంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2) ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ నిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||