Worship

యేసు పరిశుద్ధ నామమునకు

Yesu Parishuddha Naamamunaku

Watch on YouTube
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము (2) ఇహపరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది (2) పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| సైతానున్‌ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది (2) జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| నశించు పాపుల రక్షించు లోక మున కేతెంచిన నామమిది (2) పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది (2) లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు|| శోధన, బాధల, కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది (2) ఆటంకము తొలగించు నామమిది (2) ||యేసు||