Worship

యేసు నీ వారము – నీవే మా రాజువు

Yesu Nee Vaaramu – Neeve Maa Raajuvu

Watch on YouTube
యేసు నీ వారము – నీవే మా రాజువు (2) తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2) ||యేసు|| మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం అన్నీ నీవొసగినవే మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే స్తుతి స్తోత్రముల్ నీకేలే (2) సర్వంబు నీవైన ప్రభువా హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2) ||యేసు|| ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు అన్నీ నీవొసగినవే ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని మాకోసం నిలిపితివే (2) ఆద్యంతముల ప్రభువా ఆరాధింతుము నిన్నే (2) ||యేసు|| సిలువలో మరణించి – మరణమునే ఓడించి జయమును పొందితివే పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి పరమును ఒసగితివే (2) మమ్మెంతో ప్రేమించి మా కొరకు నిలచితివే (2) ||యేసు||