Worship

యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా

Yesu Nee Naamaamruthamu Maa Kentho Ruchi Ayyaa

Watch on YouTube
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ మా – దోషములను హరించి మోక్షని వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ యెంతో – కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ నీ – దాపు జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు|| అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు|| అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ నీ – సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు||