Devotional

యేసయ్య మాట విలువైన మాట

Yesayya Maata Viluvaina Maata

Watch on YouTube
యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా సోదరా వినిపించుకోవా సోదరీ (2) నీ గుండెలోన ముద్రించుకోవా ఏ నాటికైనా గమనించలేవా గమనించుము పాటించుము ప్రచురించుము నిన్నూవలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2) అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2) నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||